చక్కనమ్మ చిక్కినా అందమే అని ఒక నానుడి ఉంది. అది రాశి ఖన్నాకు బాగా సూటవుతుంది. కెరీర్ ఆరంభంలో ‘ఊహలు గుసగుసలాడే’ సహా కొన్ని చిత్రాల్లో ఈ ఢిల్లీ భామ ఎంత బొద్దుగా కనిపించిందో తెలిసిందే. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్‌లో కనిపించినప్పటికీ ఆమె కుర్రకారు మనుసులు దోచిందే. కానీ కెరీర్ ముందుకు సాగే క్రమంలో తన లుక్స్ గురించి కామెంట్లు రావడంతో రాశి అలెర్ట్ అయింది. బరువు తగ్గి అందరు హీరోయిన్ల లాగే నాజూగ్గా తయారైంది. తన కొత్త లుక్ చూసి మెచ్చిన వాళ్లూ ఉన్నారు. అలాగే ముందులా బొద్దుగా ఉంటేనే బాగుంటుందనీ అన్నీ వాళ్లున్నారు.

కొత్త లుక్‌తో కొన్ని మంచి అవకాశాలు దక్కించుకుని కెరీర్లో బాగానే సాగిపోతున్నట్లు కనిపించింది రాశి. కానీ ఈ మధ్య ఆమె జోరు బాగా తగ్గిపోయింది. తెలుగులో అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు బాలీవుడ్లో కొన్ని ఛాన్సులున్నాయి. ఐతే లీజర్ టైంను రాశి బాగానే ఉపయోగించుకుంటోంది. తన అందచందాల్లో కొత్త కోణాల్ని చూపిస్తూ డిఫరెంట్ ఔట్ ఫిట్స్‌తో తరచుగా ఫొటో షూట్లు చేస్తోంది. లేటెస్ట్‌గా మోడర్న్ డ్రెస్‌లో రాశి ఫొటోలు చూస్తే అందాల్ని రాశి పోసిన ఫీలింగ్ కలుగుతోంది. ఇంతందాన్ని తెలుగు దర్శకులు సరిగా ఉపయోగించుకోవట్లేదే అని ఫీలవుతున్నారు అభిమానులు.

By Ttimes

స్పందించండి