అర్జున్ రెడ్డి పేరుకు బోల్డ్ సినిమానే కానీ.. అందులో మరీ బోల్డ్ సీన్లేమీ ఉండరవు.. నిజానికి అందులో హీరోయిన్ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్ అన్న మాటే ఉండదు. రెగ్యులర్‌గా మనం చూసే హీరోయిన్లకు చాలా భిన్నంగా కనిపించింది షాలిని పాండే అందులో. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించిన షాలిని.. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ పొందలేదు.

ఆ తర్వాత ఆమెకు వచ్చిన అవకాశాలు తక్కువ. వాటి వల్ల కెరీర్ అంతగా ఊపందుకోలేదు. తనలోని గ్లామర్ యాంగిల్ హైలైట్ కాకపోవడం వల్లే అవకాశాలు రావట్లేదనుకుందో ఏమో.. చాన్నాళ్లుగా ఆ కోణాన్ని ఎలివేట్ చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది షాలిని. తొలి సినిమా తర్వాత బరువు తగ్గి నాజూగ్గా తయారైన ఆమె.. ఫొటో షూట్ల ద్వారా అలుపెరగని గ్లామర్ ఎటాక్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ మోడర్న్ ఔట్ ఫిట్‌లో ఆమె చేసిన బ్యాక్ లెస్ ఫొటో షూట్ సోషల్ మీడియలో ట్రెండ్ అవుతోంది. కెరీర్ ఆరంభంతో పోలిస్తే చాలా మారిపోయిన షాలిని.. ‘అర్జున్ రెడ్డి’లో చూసింది ఈ అమ్మాయినేనా అన్న సందేహాలు కలిగిస్తోంది కొత్త ఫొటోల్లో.

By Ttimes

స్పందించండి